ఈటల గెలుపుతో టీఆర్ఎస్ పతనం ప్రారంభం : బుక్క వేణుగోపాల్

by Shyam |   ( Updated:2021-11-02 10:20:29.0  )
ఈటల గెలుపుతో టీఆర్ఎస్ పతనం ప్రారంభం : బుక్క వేణుగోపాల్
X

దిశ శంషాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల గెలుపుతో టీఆర్ఎస్ పతనం మొదలైందని బీజేపీ రాష్ట్ర నాయకుడు బొక్క వేణుగోపాల్ అన్నారు. రాజేందర్ గెలవడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పాలనకు హుజురాబాద్ లో బీజేపీ గెలుపు నిదర్శనమన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్ని రకాలుగా కుయుక్తులు పన్నినా బీజేపీ గెలుపును ఆపలేకపోయిందన్నారు .

ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేస్తూ గత ఏడు సంవత్సరాలుగా పరిపాలిస్తున్నాడన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఓబిసి మోర్చా ప్రధాన కార్యదర్శి నానవాళ్ళ కుమార్ యాదవ్, సర్పంచ్ సునిగంటి సిద్ధులు, బీజేవైఎం మండల అధ్యక్షుడు బుక్క ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story