ఈ నెలా.. గతేడాది కరెంటు బిల్లే

by Shyam |
ఈ నెలా.. గతేడాది కరెంటు బిల్లే
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో గృహ వినియోగదారులు గతేడాది ఏప్రిల్ నెలలో వచ్చిన విద్యుత్ బిల్లునే ఈ నెల చెల్లించాల్సి ఉంటుందని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) ప్రకటించాయి. వాణిజ్య వినియోగదారులకు మాత్రం ఈ నెల 7 తర్వాత లాక్‌డౌన్ పొడిగిస్తే కనీస విద్యుత్ బిల్లులు జారీ చేస్తామని తెలిపాయి. ఈ మేరకు అనుమతి కోరుతూ తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్(టీఎస్ఈఆర్‌సీ)లో పిటిషన్ వేయగా కమిషన్ అనుమతిచ్చినట్టు రాష్ట్ర డిస్కంలు టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ తెలిపాయి. లాక్‌డౌన్ వల్ల ఇంటింటికి వెళ్లి మీటర్ రీడింగ్ తీయడం కుదరనందున ప్రస్తుతానికి గత ఏడాది బిల్లులే వసూలు చేస్తున్నట్లు డిస్కంలు పేర్కొన్నాయి. అయితే లాక్ డౌన్ ఎత్తివేస్తే మాత్రం ఇంటింటికి వెళ్లి వాస్తవ రీడింగ్‌లు తీయనున్నట్లు వెల్లడించాయి. ఎవరి విద్యుత్ బిల్లు ఎంత అనేది ఆయా డిస్కంలు వాటి వెబ్‌సైట్లలో పెట్టనున్నాయి. గృహ వినియోగదారుల్లో 2019 ఏప్రిల్‌కు ముందే విద్యుత్ కనెక్షన్లు కలిగి ఉన్న వారు 2019 మే నెలలో వచ్చిన విద్యుత్ బిల్లు కట్టాలని, 2019 మేలో కొత్తగా కనెక్షన్ తీసుకున్నవాళ్లు 2020 ఫిబ్రవరి విద్యుత్ బిల్లు మొత్తం చెల్లించవచ్చని, కొత్తగా ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో కనెక్షన్ తీసుకున్నవాళ్లు కనీస బిల్లు కట్టొచ్చని డిస్కంలు తెలిపాయి.

tags: telangana, power bills, discoms, cerc order, corona lockdown

Advertisement

Next Story

Most Viewed