ఆన్‌లైన్ బోధనకు ఏర్పాట్లు పూర్తి చేయండి

by  |
ఆన్‌లైన్ బోధనకు ఏర్పాట్లు పూర్తి చేయండి
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ ఆన్‌లైన్ బోధనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మెహంతి డీఈఓను ఆదేశించారు. శుక్రవారం డీఈఓ వెంకనర్సమ్మ, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తదితరులతో డీఈఓ కార్యాలయంలో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ హాజరై మాట్లాడుతూ… ఉపాధ్యాయులందరూ తమ సృజనాత్మకతతో వర్క్ షీట్స్, డిజిటల్ పాఠాలు తయారు చేయాలని ఆదేశించారు.

విద్యార్థులు సులభంగా నేర్చుకునే విధంగా పాఠం బోధించాలని సూచించారు. ఆన్‌లైన్ తరగతుల నిర్వాహణ కోసం టీవీలు, అండ్రాయిడ్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్ వంటివి అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. పాఠశాల విద్యా కమిటీ , తల్లిదండ్రలు సమావేశాలు కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని, వలస వెళ్లిన విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ లెర్నింగ్ విధానంలో భాగస్వాములు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్ లైన్ బోధన విషయంలో అవసరమైతే స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు.



Next Story

Most Viewed