- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిర్ణయం సరే.. టీకాలేవి?
దిశ, తెలంగాణ బ్యూరో: ఉత్పత్తి సంగతేమోగానీ 18 ఏళ్లు నిండినవారందరికీ మే నెల 1వ తేదీ నుంచి టీకాలు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ లెక్కలేసుకుంటోంది. టీకాలు ఇవ్వడానికి ఏర్పాట్లు, వైద్య సిబ్బంది, వ్యాక్సినేషన్ కేంద్రాలు ఉన్నా తగినన్ని నిల్వలు వస్తాయో రావోననే ఆందోళన పట్టుకుంది. ప్రస్తుతం రోజుకు లక్షన్నర మందికి టీకాలు ఇస్తున్నా సమృద్ధిగా నిల్వలు ఉంటే పది లక్షల మందికి కూడా ఇవ్వగలమని వైద్యారోగ్య శాఖ భావిస్తోంది. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడినవారి సంఖ్య సుమారు 2.62 కోట్ల మంది ఉంటారని అంచనా వేసింది. అవసరాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో టీకాలను అందించగలిగినట్లయితే నెల రోజుల్లోనే ప్రక్రియను పూర్తి చేయగలుగుతామని వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. కానీ ఇప్పుడున్నట్లుగా సరఫరా అరకొరగా ఉంటే మాత్రం ఐదారు నెలలైనా పూర్తి చేస్తామో లేదో చెప్పలేమని అభిప్రాయపడ్డారు.
ఒకవేళ ప్రైవేటు మార్కెట్‌లో కూడా టీకాలు అందుబాటులోకి వస్తే దాన్ని అంచనా వేయలేమన్నారు. కేంద్రం నిర్ణయం తీసుకోవడాన్ని తాము తప్పు పట్టదల్చుకోలేదుగానీ రాష్ట్రాల అవసరాలకు తగినంతగా ఉత్పత్తి చేయడం, పంపిణీ చేయడం కూడా ఆలోచించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. సుమారు 2.62 కోట్ల మందికి టీకాలు ఇవ్వాలంటే ఐదున్నర లక్షల డోసులు (వృథాతో కలిపి) అవసరమని పేర్కొన్నారు.