- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విద్యార్థి శివ నాగులు మృతికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలి.

దిశ, అచ్చంపేట: నల్లమల ప్రాంతం నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని మాధవ వాణిపల్లి గ్రామానికి చెందిన చెట్టు కింది శివనాగులు మృతికి కారకులైన వారిని తక్షణమే శిక్షించాలని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అఖిల పక్షాలు ప్రజా సంఘాలు, కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, నాగర్ కర్నూలు జిల్లా డీసీసీ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ, అచ్చంపేట బీఎస్పీ పార్టీ ఇన్చార్జ్ నారి మల్ల వెంకటస్వామి మాట్లాడుతూ.. కళాశాల యాజమాన్యం మూలంగానే విద్యార్థి శివ నాగులు మృతిచెందాడని, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. కళాశాల యాజమాన్యం బాధిత కుటుంబాలతో మాట్లాడాలని, మృతికి సంబంధించిన కారణాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పోలీసులు కార్పొరేట్ వ్యవస్థకు వత్తాసు పలుకుతూ అమాయకులను బలి తీసుకుంటుందని వారు విమర్శించారు. బాధితుల పక్షాన పోలీసు యంత్రాంగం ఉండాల్సింది పోయి కార్పొరేటు యాజమాన్యాలకు తలొగ్గి న్యాయం అడుగుతున్నా వారిని అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు.
ఈ సంఘటనకు సంబంధించి జరిగిన విషయాలు బయటకు పొక్కకుండా అన్యాయం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని కళాశాల యాజమాన్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజనిర్ధారణ కమిటీ ద్వారా వాస్తవాలు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. వందల మంది పోలీసులను దింపి న్యాయాన్ని అన్యాయం చేసేలా ప్రభుత్వం కార్పొరేట్ యజమానులకు అండగా నిలుస్తుందని విమర్శించారు.
- Tags
- Guilty