- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నడిరోడ్డుపై మొసలి హల్‌చల్..

X
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా మొసల్లు నీటిలోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అవి కనిపించడం కూడా చాలా అరుదు. అలాంటిది ఓ మొసలి నడిరోడ్డుపై హల్‌చల్ చేసింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది.
వివరాళ్లోకి వెళితే… గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి పొర్లుతుండటంతో, వజినేపల్లి గ్రామ శివారులోని కత్తా వాగుపై మొసలి రోడ్డు మీదకు వచ్చింది. దీంతో రోడ్డుపై మొసలిని చూసిన ప్రయాణికులు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రోడ్డుమీద నుంచి మొసలి వెళ్లిపోయేవరకూ రోడ్దుపై రెండు వైపులా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. మొసలి వెళ్లిపోయిన అనంతరం ప్రయణికులంతా సురక్షితంగా వెళ్లిపోయారు.
Next Story