నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : సీపీఐ

by  |
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : సీపీఐ
X

దిశ, మధిర: ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన అన్నదాతను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిధిలోని నాగిలిగొండ, ప్రొద్దుటూరు గ్రామాల్లో వర్షాలకు నష్టపోయిన పంటలను సీపీఐ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలన్నీ నీటమునిగాయని, దిగుబడిపై తీవ్ర ప్రభావం పడటంతో అన్నదాత కుదేలైయ్యాడని అన్నారు.పెసర పంట పూర్తిగా నష్టపోయిందని తెలిపారు. మండల వ్యాప్తంగా ఆరువేల ఎకరాల్లో పెసర, సుమారు 25 వేల ఎకరాల్లో పత్తి, 5 వేల ఎకరాల్లో వరి సాగు చేయడం చేశారని అన్నారు. పంట దిగుబడికొచ్చేసరికి అకాల వర్షానికి లక్షల్లో నష్టపోయారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించటంతో పాటు పంటల నష్ట నివేదికను అందజేయాలని, పెసర పంటకు 30 వేలు, పత్తి పంటకు 40 వేలు అందించాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed