- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే, సర్పంచ్ కృషి.. గ్రామ ప్రజల ఏళ్ల కల సాకారం
దిశ, చిట్యాల : ఆ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. ఆపదొచ్చినా, ఏదైనా అత్యవసరంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినా ఆ గతుకుల తారురోడ్డుపై ప్రయాణించాల్సిందే. కొన్ని దశాబ్దాలుగా ఆ పల్లెవాసులు రోడ్డులేక ఇబ్బందులు పడుతున్నారు. వారి రహదారి కష్టాలు నేటితో తీరిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలంలోని కైలాపూర్, చింతకుంట రామయ్యపల్లి గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. చిట్యాల, టేకుమట్ల ప్రధాన రహదారికి సమీపంలో ఉన్న ఈ గ్రామానికి వెళ్లాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు.
రోడ్డు వేయించాలని దశాబ్దాలుగా ప్రజాప్రతినిధులను, అధికారులను వేడుకున్నారు. స్పందించిన అప్పటి మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. కానీ కాంట్రాక్టర్ తప్పుకోవడంతో రోడ్డు పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. స్పందించిన స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని వేగంగా రోడ్డు నిర్మాణ పనులు పూర్తిచేయించారు. దీంతో గ్రామ ప్రజల ఏండ్ల కలను సాకారం చేస్తూ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి.. దీంతో గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, జడ్పీటీసీ గొర్రెసాగర్, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్యే కృషితోనే రోడ్డు సాధ్యమైంది..
చింతల శ్వేత సుమన్,కైలాపూర్ సర్పంచ్..
గత కొన్నేళ్లుగా మా కైలాపూర్ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. రోడ్డు నిర్మాణానికి నాలుగు సంవత్సరాల క్రితం నిధులు మంజూరు అయినా రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించలేదు. దీంతో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం స్పందించిన ఆయన తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేటితో రోడ్డు నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. మా గ్రామానికి రోడ్డు సౌకర్యం మెరుగుపడడం సంతోషంగా ఉంది.
ఇన్నాళ్లు గుంతలరోడ్డుతో ఇబ్బందులు పడ్డాం.. రాపెల్లి రాజు కైలాపూర్
మా ఊరుకు ఇన్ని రోజులు రోడ్డు బాగాలేక కనీసం బస్సులు కూడా వచ్చేవి కావు. దీంతో సుమారు రెండు కిలోమీటర్లు నడిచి ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు రోడ్డు పనులు పూర్తయ్యాయి మా ఊరికి బస్సు, సరైన రోడ్డు సౌకర్యం ఉంది.. దీంతో ప్రయాణం సాఫీగా చేయొచ్చు.