- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనాతో కానిస్టేబుల్ మృతి
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: కరోనా బారిన పడి మరో ఫ్రంట్ లైన్ వారియర్ అసువులు బసారు. వివరాళ్లోకి వెళితే… జోగుళాంబ గద్వాల జిల్లాలో పోలీస్ సాయుధ దళ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న యూ.శ్రీనివాసులు కరోనాతో మంగళవారం మృతిచెందారు. ఇటీవల కరోనా బారిన పడి, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి మరణించారు. దీంతో శ్రీనివాసులు మృతి పట్ల గద్వాల ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్, జిల్లా అదనపు ఎస్పీ కృష్ణ, ఇతర పోలీస్ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… 8 ఏండ్ల నుంచి కానిస్టేబుల్‌గా సేవలు అందించి, అందరి మన్ననలు పొందారని తెలిపారు. జిల్లా పోలీస్ కుటుంబంలో ఒకరిని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ కుటుంబానికి జిల్లా పోలీస్ యంత్రాంగం తరుపున అండగా ఉంటామని, వారి కుటుంబ సభ్యులకు మనో దైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.