- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారంలో ఉండి భిక్షాటన ఏంటి.. బీజేవైఎం నేతలను ఆటాడేసుకున్న సామాన్యుడు..
దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో వరద బాధిత ప్రాంతాల్లో ఆయా రాజకీయ పార్టీల నేతలు పర్యటిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం సాయం చేస్తుండగా.. మరోవైపు రాజకీయ పార్టీలు సైతం వరద బాధితులకు సాయం చేస్తూ తాము అండగా ఉన్నామంటూ భరోసా ఇస్తున్నారు. అయితే బీజేపీ యువమోర్చా నేతలు గుంటూరులో భిక్షాటన నిర్వహించారు. వరద బాధితులను ఆదుకునేందుకు సాయం చేయాలంటూ భిక్షాటన చేశారు. బీజేపీ యువ మోర్చా నేతల భిక్షాటనను చూసిన ఓ వ్యక్తి వారికి షాక్ ఇచ్చాడు. బీజేపీ నేతలపై ప్రశ్నల వర్షం కురిపించాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కండువాలు మెడలో వేసుకొని వరద బాధితుల కోసం విరాళాలు సేకరించడం ఏంటని ప్రశ్నించారు.
రాష్ట్రం వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతుందని కేంద్రం సహాయం చెయ్యచ్చు కదా అని కేంద్రాన్ని నిలదీయవచ్చు కదా అని ప్రశ్నించాడు. అంతేకాదు కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే అది సెకన్లలో సాధ్యమవుతుందని ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదని నిలదీశారు. అతడు వేసే ప్రశ్నలకు బీజేపీ యువ మోర్చా నేతలకు ముచ్చెమటలు పట్టాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సామాన్యుడి ప్రశ్నకు యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర మోహన్ విస్తుపోయాడు.