- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాక్సిన్ వ్యాన్ ను ప్రారంభించిన కలెక్టర్
దిశ, సిరిసిల్ల: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అన్ని రకాల వ్యాధి నిరోధక వ్యాక్సిన్లను సరఫరా చేయడానికి కేటాయించిన వ్యాక్సిన్ వ్యాన్ ను శుక్రవారం కలెక్టర్ కృష్ణ భాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్ వ్యాన్ అందుబాటులోకి రావడం వల్ల హైదరాబాద్ నుండి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అన్ని రకాల వ్యాధి నిరోధక వ్యాక్సిన్ లను సరఫరా చేయడం సులభతరం అవుతుందని తెలిపారు. మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్ రవాణాలో ఇబ్బందులు తొలుగుతాయని పేర్కొన్నారు. వ్యాక్సిన్ ను నిల్వ చేయడానికి సరిపడా ఉష్ణోగ్రత వ్యాన్ లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. కరోనా వ్యాధి వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కులు ధరిస్తూ, కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. అర్హులైన ప్రతీ ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. అప్రమత్తంగా ఉంటూ వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.