‘దిశ’ ఎఫెక్ట్: అధికారులపై కలెక్టర్ సీరియస్

by Shyam |
haritha haram
X

దిశ, చండూరు: అధికారుల నిర్లక్ష్యం మూలంగా హరితహారం మొక్కలు ఎండుతున్నాయని, ఈ నెల 10వ తేదీన ‘దిశ’ పత్రికలో కథనం ప్రచురితమైంది. దీనికి నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ స్పదించారు. ఈ మేరకు అధికారులపై సీరియస్ అయ్యారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం సరంపేట గ్రామ పంచాయతీ 280, 281 సర్వే నెంబర్‌లోని బృహత్ పల్లె ప్రకృతివనంలో భారీగా మొక్కలు నాటారు. కానీ, మొక్కల రక్షణకు మాత్రం చర్యలు తీసుకోలేదు. విషయం తెలిసిన కలెక్టర్ జిల్లా పర్యవేక్షకుడు, మండల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో యుద్ధ ప్రాతిపదికన పల్లెప్రకృతి వనాన్ని సందర్శించి కావాల్సిన ఏర్పాట్లను వేగవంతం చేశారు. విద్యుత్ అధికారులు కొత్త స్తంభాలను నాటడం వంటి ఏర్పాట్లను చేశారు.

మొక్కలు ఎండిపోకుండా 8 గ్రామ పంచాయతీల నుండి వాటర్ ట్యాంకులతో నీటిని తెప్పించి మొక్కలకు సరఫరా చేస్తున్నారు. అలాగే శివన్నగూడ రిజర్వాయర్ నుండి కూడా ట్యాంకర్ల ద్వారా నీటిని చెప్పించి మొక్కలకు సరఫరా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో మొక్కలు ఎండిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలతో అధికారులు వేగవంతంగా దగ్గరుండి నీటి సరఫరా చేస్తూ మోటార్లను బిగించారు. పైపులైన్ల కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ తెలిపారు.

Advertisement

Next Story