డోర్ డెలివరీకే ప్రాధాన్యతనివ్వాలి : కలెక్టర్

by Shyam |   ( Updated:2020-04-09 06:54:07.0  )

దిశ, వరంగల్: నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ ద్వారానే వ్యాపారస్తులు ఇంటింటికి చేరవేయాలని కలెక్టర్ గౌతమ్ ఓ ప్రకటనలో కోరారు. వరంగల్ జిల్లాలో 1300 మంది వలంటీర్లు ఉన్నారని, వీరిని డోర్ డెలివరీకి వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలెవరూ నిత్యావసర వస్తువుల కోసం రోడ్లపైకి రాకూడదన్నారు. వ్యాపారులు కూడా డోర్ డెలివరీకే ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Tags : collector, ordered, door delivery, corona, warangal, Volunteers

Advertisement

Next Story

Most Viewed