- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ నిర్మాణాలు… దసరా నాటికి పూర్తి చేయాలి
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: జిల్లాలో చేపట్టిన రైతు వేదికల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో రైతు వేదికల నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల, గ్రామాల వారీగా నిర్మాణ పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…
జిల్లాలో చేపట్టిన రైతు వేదికల నిర్మాణ పనులు వేగవంతం చేసి వెంటనే పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాకు మంజూరైన 79 రైతు వేదికల నిర్మాణాలను దసరా నాటికి పూర్తి చేయాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనుల పురోగతిని ప్రతిరోజూ పర్యవేక్షించాలని, ఇసుక, సిమెంట్, రాడ్ ఇతర సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. రైతు వేదికల ప్రాంగణంలో ఆహ్లాదవాతావరణం కనిపించేలా విభిన్న ఆకృతులకు ప్రాధాన్యతనిస్తూ పచ్చదనం పెంపొందేలా విరివిగా మొక్కలు నాటాలన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.