అక్రమ నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్

by  |   ( Updated:2021-11-10 11:02:13.0  )
Collector Sheikh Yasmin bhasha
X

దిశ, వనపర్తి: మున్సిపాలిటీ పరిధిలో లేఅవుట్ల క్రమబద్ధీకరణ లేకుండా నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తీకుంటామని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లో టీఎస్ బీ-పాస్ లే అవుట్లు క్రమబద్ధీకరణ అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో లే అవుట్ల క్రమబద్ధీకరణకు తొమ్మిది దరఖాస్తులు రాగా, వాటిలో నాలుగు పర్యవేక్షణలో ఉన్నాయని, మిగతా 5 పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు ఉంటే మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేయాలని ఆదేశించారు.

వార్డుల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షణ చేయాలని సూచించారు. టీఎస్ బీ-పాస్ ద్వారా లే అవుట్లను క్రమబద్ధీకరించడానికి ప్రజలు, అధికారులకు సహకరించాలని అన్నారు. అనంతరం హరితహారంపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గుల్ మొహర్ మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని, నర్సరీల్లో మొక్కలు ఏపుగా పెరిగేలా సకాలంలో నీరు అందేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆశీష్ సంగ్వాన్, సూపరింటెండెంట్ ఇంజినీర్ పీవీ నాగేంద్ర, ఆర్అండ్‌బీ ఈఈ దేశ్య నాయక్, ఇరిగేషన్ ఈఈ మధుసూదన్ రావు, పంచాయతీ రాజ్ ఈఈ ఈమల్లయ్య, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ కురుమయ్య, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, అమరచింత, ఆత్మకూర్ కొత్తకోట పెబ్బేర్ మున్సిపల్ కమిషనర్లు రమేష్, జాన్ కృపాకర్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story