- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రఘురామపై కొనసాగుతున్న విచారణ.. సీఐడీ కీలక ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గుంటూరు సీఐడీ కార్యాలయంలో ఆయన్ను విచారిస్తున్నారు. సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ నేతృత్వంలో ఈ విచారణ జరుగుతోంది. తాజాగా.. ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌పై సీఐడీ ఏడీజీ కీలక ప్రకటన చేసింది. విద్వేషపూరిత వ్యాఖ్యల ద్వారా.. ప్రభుత్వంపై అసంతృప్తి పెంచే విధంగా కుట్రపన్నారని వెల్లడించారు.
ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లేలా వ్యాఖ్యలు చేశారని అన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు పలుమార్లు యత్నించారని తెలిపారు. తన ప్రసంగాలతో వివిధ వర్గాల మధ్య విద్వేషాన్ని పెంచారని అన్నారు. శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు రఘురామ ప్రయత్నించారని వెల్లడించారు. ఈ మేరకు ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. దీంతోనే ఎంపీపై 124ఏ, 153ఏ, 505, 120బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు.