ఏపీ ప్రభుత్వానికి కేంద్రం తీపి కబురు

by Anukaran |
cm-jagan-meet d
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం తీపికబురు చెప్పింది. రాష్ట్రానికి అదనపు రుణ సమీకరణకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూలధన వ్యయ లక్ష్యాన్ని చేరుకున్న రాష్ట్రాలకు కేంద్రం రుణ ప్రోత్సాహకాలు ప్రకటించింది. మూలధన వ్యయంలో తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్‌ 15 శాతం టార్గెట్‌ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో 2021-22 త్రైమాసిక-1లో అదనపు రుణాల సమీకరణకు అంగీకారం తెలిపింది. అందులో భాగంగా రాష్ట్రానికి రూ.2,655 కోట్ల రుణ సమీకరణకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

దీంతోపాటు మార్కెట్ నుంచి అదనంగా రూ.15,721కోట్లు రుణ సమీకరణ చేసుకోవచ్చని వెల్లడించింది. అలాగే ఏపీకు జీఎస్‌డీపీలో నాలుగు శాతం నిక‌ర రుణాల ప‌రిమితిపై 0.50 శాతం కేంద్రం ప్రోత్సాహ‌కం ఇచ్చింది. దేశవ్యాప్తంగా మూలధన వ్యయలక్ష్యాన్ని చేరుకున్న ఆంధ్రప్రదేశ్‌తోపాటు 11 రాష్ట్రాలకు అదనపు రుణ సమీకరణకు కేంద్రం అనుమతినిచ్చింది.

Advertisement

Next Story

Most Viewed