కేబినెట్ కీలక నిర్ణయం.. కొత్త రేషన్ కార్డులు మంజూరు

by Shyam |
CM KCR
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం మంగళవారం జరిగింది. ప్రగతి భ‌వ‌న్‌ వేదికగా జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, అధికారులు హాజ‌రయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగ్‌లో ఉన్న 4 లక్షల 46 వేల 169 రేషన్‌ కార్డులను కూడా మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు.

రేషన్ డీలర్ల కమీషన్ సహా ఇతర సమస్యలు పరిష్కారానికి కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఈ సబ్‌ కమిటీ పని చేయనుంది. కమిటీలో సభ్యులుగా హరీష్‌రావు, తలసాని, సబిత, ఇంద్రకరణ్‌రెడ్డి ఉండనున్నారు. హైదరాబాద్‌ మినహా పాత 9 జిల్లాల్లో తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కొక్కటి 250 ఎకరాలకు తగ్గకుండా రైస్ మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు.

Advertisement

Next Story