బోయినపల్లిలో విషాదం.. నాలాలో పడి బాలుడు మృతి

by Sumithra |   ( Updated:2021-06-05 02:25:56.0  )
బోయినపల్లిలో విషాదం.. నాలాలో పడి బాలుడు మృతి
X

దిశ, కంటోన్మెంట్ : సికింద్రాబాద్ బోయినపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. చిన్నతోకట్ట నాలాలో పడి ఆనంద్ సాయి (7) మృతి చెందాడు. ఇంటి ముందు ఆడుకుంటుండగా నాలాలో పడి బాలుడు మృతి చెందినట్టు తెలుస్తోంది. బాలుడు నాలాలో పడిపోయిన కొద్ది దూరంలోనే అతని డెడ్ బాడీని గుర్తించినట్టు స్థానికులు తెలిపారు. అయితే నాలాకు రక్షణ గోడ లేకపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాలుడి డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవ్వరూ..?

బోయినపల్లి నాలా అభివృద్ధిని పట్టించుకున్న నాధుడే లేడు. గతంలో ఎన్నో సార్లు అధికారులకు, పాలకులకు స్థానికులు మొరపెట్టుకున్నారు. నాలా చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు చెయ్యక పోవడంతో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story