- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఊపిరి తీసిన ఊయల
దిశ, వెబ్‌డెస్క్: ఊయల ఊపిరి తీసింది. రెండేళ్లకే నూరేళ్లు నింపింది. బుడి బుడి అడుగులు, ముద్దులొలికే మాటలతో ఇళ్లంతా సందడి చేసే పసిప్రాణం పచ్చని చెట్టుకింద ప్రాణాలు విడిసింది. కొడుకే ప్రపంచమని భావిస్తున్న తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చింది. అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలకు గుండె బరువు చేసి, నోట్లో నుంచి మాట రాకుండా చేసింది. సూర్యాపేట జిల్లాలో జరిగిన విషాదకర ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన లింగరాజు, శైలజ దంపతులకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. మంగళవారం వ్యవసాయ పనులకు వెళ్తున్న సమయంలో తమతో పాటు బాలుడిని బావి దగ్గరకు తీసుకెళ్లారు. అయితే బాలుడు పాలు తాగి నిద్రపోవడంతో తల్లిదండ్రులు చెట్టుకు చీరతో ఊయల కట్టి అందులో పడుకోబెట్టి పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. కొంతసేపటికి మేల్కొన్న బాలుడు చీరలో అటు ఇటు తిరగడంతో అది మెడకు బిగుసుకొని ఊపిరాడక చనిపోయాడు.
అయితే తల్లిదండ్రులు బాలుడి ఇంకా నిద్ర లేవడం లేదని చెట్టుకిందకు వచ్చేసరికి చీరతో కట్టిన ఊయలలో చుట్టుకొని చనిపోవడంతో బోరున విలపించారు. పండగ సమయంలో రెండేళ్ల బాలుడు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.