- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పోలీస్ స్టేషన్‌కు చేరిన చిన్నారుల పెన్సిల్ పంచాయితీ
దిశ, డైనమిక్ బ్యూరో : ఎవరి ఇంట్లో అయినా దొంగతనం జరిగిందంటే చాలు.. వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేస్తుంటాం. చోరీలో కోల్పోయిన విలువైన వస్తువులను పోలీసులకు చెబుతాం. అయితే, పెన్సిల్ పోయిందని కేసు పెట్టడం ఎక్కడైనా చూశారా? ‘నేను లోకల్’ సినిమాలో చూశాం అంటారా? అది సినిమా.. కానీ, కర్నూలు జిల్లా పెద్దకడుబూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే జరిగింది.
ఓ పిల్లాడు రోజూ తన పెన్సిళ్లు దొంగలించబడుతున్నాయంటూ కేసు పెట్టేందుకు వచ్చాడు. రోజూ తన పెన్సిళ్లు, రబ్బర్లు దొంగిలిస్తున్నాడని కేసు పెట్టాలని హనుమంతు అనే బాలుడు పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. ఆ బాలుడిని స్టేషన్‌కు తీసుకొచ్చిన హనుమంతు.. వెంటనే కేసు పెట్టి జైలులో వేయాలంటూ కోరాడు. ఏదైనా అయితే బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడుతానంటూ ఊగిపోయాడు. పిల్లాడి అమాయకత్వానికి నవ్వుకున్న పోలీసులు రాజీ చేసే ప్రయత్నం చేసినా అస్సలు వినిపించుకోలేదు. ఈసారికి వదిలిపెట్టు అని బాలుడికి నచ్చజెప్పినా జైలుకు పంపాలంటూ పట్టుబట్టాడు. ఇక చివరికి ఇంకోసారి అలా చేయొద్దని హనుమంతుకి చెప్పి ఇంటికి పంపించారు. ఇదంతా వీడియో తీసిన పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.