- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గల్లంతైన ముగ్గురు యువకుల మృతదేహాలు వెలికితీత
దిశ ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌లో గల్లంతైన ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. సోమవారం తెల్లవారు జామున గజ ఇతగాళ్లు మూడు మృతదేహాలను బయటకు తీశారు. మృతులు నిజమాబాద్ నగరంలోని అర్సపల్లికి చెందిన బూర్గుల రాహుల్, అసది ఉదయ్, శివలుగా గుర్తించారు. వీరు ఆదివారం నందిపేట మండలం జీజీనడుకూడ గ్రామ శివారులో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌లో గల్లంతైన విషయం తెలిసిందే.
అర్సపల్లికి చెందిన సాయి కృష్ణ ( పింకు) , కనుకుల రోహిత్, గద్దల రాజేందర్ లతో పాటు బూర్గుల రాహుల్, అసది ఉదయ్, గట్టు శివ స్నానానికి దిగారు. లోతు తెలియక నీటిలో మునుగుతున్న యువకులను మెడారం రాజేశ్వర్ అను రైతు, జీజీ నడుకూడకు చెందిన యువకులు కాపాడాడు. మిగిలిన ముగ్గురు గల్లంతు కాగా వారి కోసం గాలింపు చర్యలు చెపట్టారు. చీకటి కావడంతో గల్లంతైన యువకుల మృతదేహాలను వెలికి తియ్యడం కష్టాంగా మారింది. స్నేహితుల దినోత్సవం నాడు జరిగిన విషాదం ముగ్గురు స్నేహితుల ప్రాణాలను బలికోరి వారి కుటుంబాలను శోక సంద్రంలోకి నెట్టింది.