- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండుసార్లు నెగిటివ్ వస్తేనే.. మైదానంలోకి అనుమతి
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న క్రమంలో అంతర్జాతీయ క్రీడలన్నీ వాయిదా పడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన టీ20 వరల్డ్ కప్ వాయిదా పడటంతో క్రీడాభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
కాగా పరిస్థితులు కొంత కుదుట పడటంతో భారత్‌లో క్రికెట్ పునరుద్ధరణకు బీసీసీఐ రంగం సిద్ధమైంది. క్రీడాకారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త బీసీసీఐ మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో అన్ని క్రికెట్ సంఘాలు ప్రామాణిక నిర్వహణ పద్ధతి (ఎస్‌వోపీ)ని కచ్చితంగా పాటించాలని బోర్డు సూచించింది. 100 పేజీలతో కూడిన ఎస్‌వోపీ మార్గదర్శకాల్లో పలు స్పష్టమైన సూచనలు చేసింది.
వీటిలొ ముఖ్యమైనది 60 ఏళ్ళు దాటిన వారు,దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులను శిక్షణ శిబిరాల్లోకి అనుమతించకూడదని నిర్ణయించింది. ప్రాక్టిస్ సెషన్లకు హాజరయ్యే వారు ఎన్‌ఓసీపై సంతకం చేయాలని పేర్కొంది. శిక్షణ శిబిరానికి హాజరు అయ్యే ముందు ఆటగాళ్ల గత రెండు వారాల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుని, రెండు సార్లు పరీక్షల్లో నెగిటివ్ వస్తేనే క్యాంప్‌లోకి అనుమతిస్తారు. మైదానంలోకి వచ్చేవారు కచ్చితంగా ఎన్ 95 మాస్క్‌లు ధరించాలని సూచించారు.