- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
షాబాద్‌లో విషాదం.. AR కానిస్టేబుల్ ఆత్మహత్య

దిశ, షాబాద్: వ్యక్తిగత కారణాల వల్ల AR కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన షాబాద్ మండలంలోని సీతారాంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. షాబాద్ సీఐ అశోక్ వివరాల ప్రకారం.. సీతారాంపూర్ గ్రామానికి చెందిన చాకలి శివకుమార్(25) హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో AR కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం తన స్నేహితులను కలవడానికి వెళ్తున్నానని ఇంట్లో తల్లితో చెప్పి బయటికి వెళ్లాడు. అనంతరం ఒక గంట సమయం తర్వాత మిద్దెంగూడ గ్రామ సమీపంలోని పొలం వద్దనున్న రేకుల షెడ్డులో ఉరి వేసుకున్నాడని సీతారాంపూర్ గ్రామస్థురాలు తెలిపినట్లు శివకుమార్ తండ్రి బాలకిష్టయ్య చెప్పాడు. వ్యక్తిగత కారణాల వల్లే తన కొడుకు ఇలా చేసాడని, ఎవరి మీదా అనుమానం లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.