ప్రభుత్వం కీలక నిర్ణయం..ఆ శాఖ అధికారుల్లో వణుకు

by srinivas |
apgovt
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో నకిలీ చలానాల కుంభకోణం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖలో నకిలీ చలానాల కుంభకోణం వెలుగులోకి రావడంతో మిగిలిన శాఖల్లోనూ ప్రభుత్వం తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. చలానాల ద్వారా చెల్లించే నగదు సీఎఫ్ఎంఎస్‌కు జమ అవుతుందా లేదా అన్న అంశంపై విచారణ జరపాలని సూచించింది. ప్రజలు చెల్లించే చలానాల నగదు జమ కావడంలో జాప్యం వల్లే అక్రమాలకు ఆస్కారం ఉంటుందని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇకపోతే రాష్ట్రంలో 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.8.13 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం నిర్ధారించింది. అయితే రూ. 4.62 కోట్ల మేర రికవరీ చేసినట్లు వెల్లడించింది. ఈ అవినీతి వ్యవహారంలో 14 మంది సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed