ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

by Anukaran |   ( Updated:2021-12-13 23:24:22.0  )
cm ys jagan
X

దిశ, వెబ్ డెస్క్: గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మిగతా ఉద్యోగుల్లాగే వారికీ పీఆర్సీ ఇస్తామని జగన్ సర్కార్ ప్రకటించింది. దీని పై వేసిన కమిటీ నివేదికలో వార్డు సచివాలయంలో పని చేసే ఉద్యోగులకు పీఆర్సీ ఆమలు చేయడం కుదరదు అని తెలిపింది. అయితే రాష్ట్ర పరిపాలనలో ముఖ్యభూమిక పోషిస్తున్నారని వారికి కూడా పీఆర్సీ అమలు చేయాలని జగన్ సర్కార్ ఆదేశించింది.

ఇందులో భాగంగా కొత్త పీఆర్సీనీ అమలు చేయడానికి యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో ప్రభుత్వం పై ఏటా 1800 కోట్ల అదనపు భారం పడనుంది. ప్రజలకు మంచి పాలన అందించడంలో గ్రామ సచివాలయ ఉద్యోగుల పాత్ర ఏంతో ఉందని అందువల్ల వారికి కూడా పీఆర్సీ అందించాల్సిందే అని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు.

గ్రామ సచివాలయంలో పనిచేసే వివిధ పోస్టులకు పేస్కేల్ మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం. గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శికి కనిష్టంగా15,030 నుంచి గరిష్టంగా 46,060 ను సూచించింది. అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీస్. ఫిషరీస్ అసిస్టెంట్, గ్రేడ్-2 అగ్రికల్చర్ అసిస్టెంట్, ఎఎన్ఎం, హార్టికల్చర్ అసిస్టెంట్, సెరికల్చర్, విలేజ్ సర్వేయర్. వెల్ఫేర్ అసిస్టెంట్, వీఆర్వో లకు కనిష్ట పేస్కేల్ గా 14,600ను గరిష్టంగా 44,870 ను సిఫార్సు చేశారు.

ఎమినిటీస్ సెక్రటరీ, ప్లానింగ్ అండ్ రెగ్యులరైజేషన్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, శానిటేషన్ అండ్ ఎన్విరాన్ మెంట్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ సెక్రటరీలకు కనిష్ట పే స్కేల్ గా 14,600 ను అలాగే గరిష్ట పేస్కేల్ గా 44,870 ను నిర్ణయించారు. వీరితో పాటు సచివాలయంలో పనిచేసే వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి కనిష్టంగా 15,600 ను గరిష్టంగా 46,060 ను నిర్ణయించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు 11 వ పీఆర్సీ అమలు చేయడం పై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story