- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ ఈపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ఈపీసెట్ 2021 ఫలితాలు విడుదలైన తరుణంలో ఇంజనీరింగ్‌తోపాటు ఫార్మసీ కోర్సులకు సంబంధించిన కౌన్సిలింగ్‌ను ఈ నెల 25 నుంచి నిర్వహించనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఇంజినీరింగ్, ఫార్మసీ అడ్మిషన్ల కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ‘ఈ నెల 25 నుంచి 30 వరకూ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు.. ఈ నెల 26 నుంచి 31 వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, నవంబర్ 1 నుంచి 5 వరకూ వెబ్ ఆప్షన్లు ఇవ్వడం ,నవంబర్ 6న ఆప్షన్లు మార్చుకోవడం, నవంబర్ 10న సీట్ల కేటాయింపు ఉంటుందని, అలాగే నవంబర్ 15 నుంచి తరగతుల ప్రారంభం అవుతాయని మంత్రి సురేశ్ వెల్లడించారు. ఈ ఏడాది నుంచి 4 ప్రైవేట్ యూనివర్సిటీల్లో 2,330 సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.
మొదటి విడత కౌన్సిలింగ్‌లో భాగంగా కన్వీనర్ కోటలో ఇంజనీరింగ్‌కు 77 వేల 357 సీట్లు, బీ ఫార్మసీలో 3 వేల 615 సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ర్యాంకుల ప్రకారం రాష్ట్రంలోని కళాశాలల్లో సీట్లను కేటాయించనున్నట్లు, అభ్యర్థులు రిజిస్ట్రేషన్ అనంతరం కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. అనంతరం వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని, ఆ తర్వాత ర్యాంకుల ప్రకారం సీట్ల కేటాయింపు జరగుతుందని అధికారులు వెల్లడించారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్.. ఏపీఈపీసెట్-2021ను కాకినాడ జేఎన్‌టీయూ నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షల అనంతరం ఇంజనీరింగ్, ఫార్మసికి సంబంధించిన ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విడివిడిగా విడుదల చేశారు.