- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ మూడు రోజులు తస్మాత్ జాగ్రత్త అంటున్న వాతావరణ శాఖ
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా మంగళవారం ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, బుధ,గురువారాల్లో ఉత్తర కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రాలోనూ ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. మంగళవారం దక్షిణ కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.
గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రాయలసీమ ప్రాంతంలో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల పడుతాయన్నారు. గురువారం నాడు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. అయితే భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు, మెరుపుల కారణంగా ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు వర్షం వచ్చిన సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది.