మెగాస్టార్ మా పార్టీ వాడే.. క్లారిటీ ఇచ్చిన ఏపీ కాంగ్రెస్

by srinivas |   ( Updated:2021-06-29 05:06:24.0  )
ap congres news
X

దిశ, ఏపీ బ్యూరో: మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ వాదేనని ఏఐసీసీ, ఏపీసీసీ స్పష్టం చేసింది. చిరంజీవి కాంగ్రెస్ వాదికాదంటూ మంగళవారం ఏపీ రాష్ట్రవ్యవహారాల కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఉమెన్ చాందీ ప్రకటించడాన్ని ఏపీసీసీ చీఫ్ సాకే శైలజానాధ్ ఖండిస్తూ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి కాంగ్రెస్ వాదేనని ప్రకటనలో తెలిపారు. చిరంజీవి తనకిష్టమైన సినీ రంగంలో బిజీగా ఉండడం వల్లనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెప్పారు. కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు, పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారని చెప్పుకొచ్చారు. చిరంజీవి, ఆయన కుటుంబం మొదట నుంచి కాంగ్రెస్ వాదులేనన్నారు. చిరంజీవి కాంగ్రెస్ వాది కాదు అని వార్తలు రాయడం దారుణమన్నారు. భవిష్యత్తులో చిరంజీవి సేవలు పార్టీకి అందుతాయి..ఆయన క్రియాశీలకంగా పాల్గొనే అవకాశం ఉందని ఏపీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ తెలిపారు.

Advertisement
Next Story

Most Viewed