- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డాక్టర్లు చెబుతున్న పచ్చి నిజాలు… లాక్‌డౌన్ తర్వాత పరిస్థితేంటి?
దిశ, వెబ్‌డెస్క్:
ఎదుటివాళ్లు ఇబ్బంది పడతారని, భయాందోళనలు చెందుతారని డాక్టర్లు ఎప్పుడూ అబద్ధం చెప్పరు. విషయం ఎంత ఇబ్బంది పెట్టేదైనా కచ్చితమైన సమాచారం ఇవ్వడమే వారికి తెలుసు. అలాగే కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం పాటిస్తున్న లాక్‌డౌన్ గురించి, దాని తర్వాత జరగబోయే పరిస్థితుల గురించి డాక్టర్ టి నర్సింగరెడ్డి కొన్ని పచ్చి నిజాలు పంచుకున్నారు. 21 రోజుల లాక్‌డౌన్ పాటించడం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ నిజమైన గొప్పదనం 22వ రోజున ఏం చేయనున్నారనేదేనని డాక్టర్ అంటున్నారు. అవును… జనతా కర్ఫ్యూ రోజున సాయంత్రం వరకు ఇంట్లో ఉండి, సాయంత్రం ఐదు కాగానే రోడ్ల మీద తిరిగి మూకుమ్మడిగా భజనలు, ర్యాలీలు చేపట్టారు. అలాగే లాక్‌డౌన్ పూర్తయిన వెంటనే 21 రోజుల నుంచి కట్టేసి ఉన్న ప్రాణం ఒక్కసారిగా రోడ్ల మీద పడి ఏదో ప్రపంచ దేశాల మీద భారతదేశం యుద్ధంలో గెలిచిన అనుభూతిని ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించే పరిస్థితి ఉందని ఆయన చెబుతున్నారు. కానీ రోజుకో కనీసం 10 నుంచి 20 కేసులు పుడుతున్న నేపథ్యంలో ఇలాంటివి చేస్తే వైరస్ విపరీతస్థాయిలో విజృంభించే అవకాశం ఉంది.
ఇక సమాజంలో పెద్ద తరగతికి చెందిన సోషల్ ఇలైట్స్ లాక్‌డౌన్ నుంచి విముక్తి పొందినట్లుగా భావించి షాపింగ్ మాల్స్, థియేటర్లు, పార్కుల్లో నిండిపోతారు. ఇక ఇన్నాళ్లు పాటించిన సామాజిక దూరం ఒక్కరోజులో వృథా అవుతుంది. దీంతో అప్పటిదాక అవకాశం కోసం ఎదురుచూస్తున్న వైరస్‌కి వ్యాపించడానికి కావాల్సినన్ని దారులు చూపించినట్లవుతుంది. దీన్ని అతిజాగ్రత్తగా భావించొచ్చు.. కానీ అలా జరగదని ఎవరూ గ్యారంటీ ఇచ్చే పరిస్థితిలో లేరు. అలాగే చిన్నాపెద్దా వ్యాపారాలు, కార్పోరేట్ కంపెనీలు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. ఇన్ని రోజుల లాక్‌డౌన్ కారణంగా వెనకబడిన పనిని మొత్తం పూర్తి చేసే ఉద్దేశంతో ఉద్యోగులను మూడు షిఫ్టుల్లో పనిచేయించినా ఆశ్చర్యం లేకపోలేదు. అయితే వారిలో ఒక్కరికి వైరస్ పాజిటివ్ ఉన్నా నష్టం ఊహించని స్థాయిలో ఉండి కంపెనీ మూసుకోవాల్సిన స్థితి కూడా వస్తుంది. అంతేకాకుండా ఇళ్లలో పనిచేసుకుంటూ బతికే వాళ్లు ఊర్ల నుంచి సిటీకి తిరిగొస్తారు. ఒక్కొక్కరు నాలుగైదు ఇళ్లలో పనిచేసి మరీ తమకు కలిగిన నష్టాన్ని పూడ్చుకోవాలనుకుంటారు. కానీ వారిలో ఒక్కరిలోనైనా పాజిటివ్ కేసు ఉండి ఉంటే ఎన్ని కుటుంబాలు నష్టపోవాల్సి వస్తుంది?
ఎంత పాజిటివ్‌గా ఆలోచించినా.. వెయ్యి మందిలో ఒక్కరికి కరోనా లక్షణాలు లాక్‌డౌన్ పూర్తయ్యే నాటికి బయటపడకుండా ఉండి, లాక్‌డౌన్ పూర్తయ్యాక కనిపించే పరిస్థితి ఉంటే… వారి రోజువారీ పనిలో ఎంతమందికి వైరస్ వ్యాపింపజేసే ప్రమాదం ఉందనే ప్రశ్నకు సమాధానం తలుచుకుంటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. కిక్కిరిసిపోయే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, సూపర్ మార్కెట్లు వైరస్ వ్యాప్తికి ప్రధాన కేంద్రాలుగా మారతాయి. 22వ రోజున తాము ఒక మహమ్మారి ప్రబలిన మధ్యస్థ దశలో ఉన్నారన్న సంగతి భారతీయులు మర్చిపోతారు. మాస్కులు ధరించరు, శానిటైజర్లు వాడరు. కనీసం చేతులు కూడా కడుక్కోరు. కేవలం 21 రోజులు ఇంట్లో ఉండి వైరస్‌కి మందు కనిపెట్టామన్న భావనలో ఉంటారు. దీంతో వైరస్ రెండో దశకు చేరుకుని మొత్తం దేశంలో దావానలంలా వ్యాపించే అవకాశం ఉంటుంది.
లాక్‌డౌన్ తర్వాత తలెత్తబోయే పరిస్థితి గురించి ఆయన చెప్పిన అంచనాలకు డాక్టర్ నర్సింగరెడ్డి 2009 హెచ్1ఎన్1 వ్యాప్తిని రుజువుగా చూపించారు. ఆ వైరస్ ప్రబలిన సమయంలో ఇలాగే క్వారంటైన్ పాటించి దాన్ని కట్టడి చేశాం అనుకున్నారు. కానీ అది సెకండ్ వేవ్ రూపంలో విరుచుకుపడింది. దీన్ని బట్టి చూస్తే ఈ 21 రోజుల లాక్‌డౌన్ నిరూపయోగమైనదేనని కనీసం చదువుకున్న వాళ్లైనా 22వ రోజు తర్వాత కూడా వీలైతే లాక్‌డౌన్ పాటించాలని ఆయన కోరుతున్నారు. లేని పక్షంలో మరొక లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాలను కూడా ఆయన వివరించారు.
ఆయన చెప్పిన వాటిలో కష్టపడి పాటించాల్సినవి ఏం లేవు. కాకపోతే అప్పుడే సాధారణ జీవితంలోకి అడుగుపెట్టకుండా కొంత సంయమనం పాటించాలి. 22వ రోజున పార్టీ చేసుకోవద్దు. వైరస్ నశించపోలేదని గుర్తుంచుకుని నిబద్ధత పాటించాలి. అలాగే సంయమనం కోల్పోయి ప్రవర్తిస్తున్న వారికి పరిణామాల గురించి అవగాహన కల్పించాలి. అలాగే ప్రభుత్వాలను కూడా లాక్‌డౌన్ ఒకేసారిగా ఎత్తివేయకుండా దశల వారీగా…అంటే.. 22వ రోజు తర్వాత మొదటివారం అత్యవసర సర్వీసులు, రెండో వారం ట్రాన్స్‌పోర్టు, మూడో వారం కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, థియేటర్లు తెరుచుకునేలా ఆదేశాలు జారీచేయాలని పిటిషన్ పెట్టాలి. ఈ ఒక్కో దశలో వైరస్ జాడల ప్రభావాన్ని అంచనా వేసి లాక్‌డౌన్ కొనసాగించడమా సడలించడమా అనే నిర్ణయం తీసుకుంటే మంచిదని నర్సింగరెడ్డి సలహా ఇస్తున్నారు. ఈ ప్రభావాలన్నిటికి గురించి కొద్దిగా సీరియస్‌గా ఉన్నా 1.3 బిలియన్ల ఇండియన్లను కాపాడిన వారిని అవుతాం. ఒకవేళ అలా సీరియస్‌గా లేని పక్షంలో ఊహించలేని నష్టం ఎదుర్కోవడానికి సిద్ధపడాల్సి ఉంటుంది. అల్లకల్లోలం జరుగుతుందనడంలో కూడా అతిశయోక్తి లేదేమో!
Tags: Corona, COVID 19, Aftermath of lockdown, lockdown, curfew, SARS, Swine flu, Second wave