శనివారం నుంచి ఆ జిల్లాలో సంపూర్ణ లాక్‌డౌన్

by srinivas |
శనివారం నుంచి ఆ జిల్లాలో సంపూర్ణ లాక్‌డౌన్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. రోజూ రెండు వేలకు పైగా నమోదు అవుతూ, విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా రోజూ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇక గుంటూరు జిల్లాలో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం ఇప్పటివరకూ నమోదైన కరోన కేసుల సంఖ్య 5000 పైచిలుకు కాగా వారిలో 1829 మనది కరోన మహమ్మరిని జయించారు, ఇప్పటికీ 32 మంది కరోనాకు బలి అయ్యారు. శనివారం నుంచి జిల్లా వ్యాప్తంగా పూర్తి లాక్‌డౌన్ అమలలో ఉంటుందని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. ఉదయం 6 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు మాత్రమే నిత్యవసర సరకుల కొనుగోళుకు అనుమతి ఉంటుందని తెలిపారు. కరోనా నియంత్రణలో భాగంగా శనివారం నుంచి వారం రోజుల పాటు పూర్తి లాక్‌డౌన్ అమలులో ఉంటుందన్నారు. అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని సూచించారు. కరోనా కట్టడిలో భాగంగా మాస్క్ తప్పని సరిగా ధరించాలని, సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్లు వియోగించాలని సూచనలు జారీ చేశారు. కరోనా నియంత్రణకు సహకరించాలని ఆయన జిల్లా ప్రజలకు కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

Next Story