ఏషియన్ ఫిల్మ్ నామినేషన్స్‌లో ‘థప్పడ్’

by  |
ఏషియన్ ఫిల్మ్ నామినేషన్స్‌లో ‘థప్పడ్’
X

దిశ, వెబ్‌డెస్క్:
హీరోయిన్ తాప్సీ నటించిన ‘థప్పడ్’ చిత్రం ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేసింది. కమర్షియల్‌గా సక్సెస్ అయిన ఈ సినిమా సూపర్ కంటెంట్‌తో ప్రేక్షకుల మెప్పు పొందింది. మోస్ట్ టాక్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గాను రికార్డు సృష్టించిన ‘థప్పడ్’.. ప్రపంచవ్యాప్తంగా మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మక ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో రెండు నామినేషన్లలో నిలిచింది. వీటిలో ఒకటి బెస్ట్ ఫిల్మ్ కేటగిరీ కాగా, మరొకటి బెస్ట్ ఎడిటింగ్. మొత్తం 11 దేశాలు, ప్రాంతాల నుంచి 39 సినిమాలు నామినేషన్లు రాగా.. కరోనా కారణంగా ఆన్‌లైన్‌లోనే అవార్డ్ ప్రజెంటేషన్ ఉండబోతుంది.

దీనిపై స్పందించిన డైరెక్టర్ అనుభవ్ సిన్హా.. సినిమాలో ఉన్న మెసేజ్ ఇంత గొప్పగా ప్రశంసించబడుతుందని అనుకోలేదని అన్నారు. గ్లోబల్‌గా కూడా సినిమాను యాక్సెప్ట్ చేయడం సంతోషంగా ఉందని.. థప్పడ్ ఏషియన్ ఫిల్మ్ అవార్డ్ నామినేషన్లలో ఉందన్న విషయం నాన్ ఇండియన్ ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందని చెప్పాడు. ఈ సినిమా బ్యాక్ డ్రాప్ నాన్ మెట్రో సిటీస్‌లో ప్లాన్ చేశానని.. కానీ ఈ సమస్య అన్ని సిటీస్‌లోనూ, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లోనూ ఉందని తన టీమ్‌లోని మహిళలు చెప్పారని అన్నారు.

క్యూరియస్ అడ్వర్టైజింగ్ అవార్డ్స్ 2020లోనూ థప్పడ్ ఐదు అవార్డులు గెలుచుకున్నట్లు తెలిపారు. డైరెక్ట్ ఉమెన్ రెస్పాన్స్ ఫిల్మ్, ఇన్నోవేషన్ ఇన్ ఏ డిజిటల్ మార్కెటింగ్ కమ్యూనికేషన్, ఫిల్మ్ అడ్వర్టైజింగ్ ఇంటరాక్టివ్ ఫిల్మ్స్, ఇన్నోవేటివ్ యూజ్ టు సోషల్ మీడియా, PSA ప్రెస్ అడ్వర్టైజింగ్ అవార్డు సొంతం చేసుకున్నట్లు తెలిపారు.


Next Story