టీజీయూజీసెట్‌-2021

by Harish |
టీజీయూజీసెట్‌-2021
X

దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని తెలంగాణ సోష‌ల్ వెల్ఫేర్ అండ్ ట్రైబ‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీల ఆధ్వర్యంలో న‌డుస్తున్న రెసిడెన్షియ‌ల్ డిగ్రీ కాలేజీల్లో 2021-2022 అక‌డ‌మిక్ ఇయ‌ర్‌కుగాను ప్ర‌తి ఏడాదికి డిగ్రీ ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే టీజీయూజీసెట్‌-2021 నోటిఫికేష‌న్ విడుద‌లైంది.

వివ‌రాలు: టీఎస్‌డ‌బ్ల్యూ రెసిడెన్షియ‌ల్ మ‌హిళా డిగ్రీ కాలేజీలు, టీటీడ‌బ్ల్యూ రెసిడెన్షియ‌ల్ డిగ్రీ పురుషులు, మహిళల కాలేజీల్లో మొద‌టి ఏడాది ప్ర‌వేశాల కోసం ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. దీనిలో అర్హ‌త సాధించిన విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో కోర్సు చ‌ద‌వాల్సి ఉంటుంది.
తెలంగాణ గురుకుల యూజీ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (టీజీయూజీసెట్‌)-2021

గ్రూపులు: బీఏ/ బీబీఏ/ బీకాం/ బీఎస్సీ

సీట్ల సంఖ్య‌: ప‌్ర‌తి గ్రూపున‌కు 40మంది విద్యార్థుల‌ను తీసుకుంటారు.

అర్హ‌త‌: మార్చి 2020లో నిర్వ‌హించిన ఇంట‌ర్‌‌/ త‌త్స‌మాన/ ఒకేష‌న‌ల్ కోర్సుల్లో క‌నీసం 40శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత‌. 2021 మేలో జ‌రిగే ఇంట‌ర్మీడియట్ సెంక‌డ్ ఇయ‌ర్‌ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న విద్యార్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. విద్యార్థుల త‌ల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామాల్లో రూ.1,50,000, ప‌ట్ట‌ణాల్లో రూ.2,00,000 మించ‌కూడ‌దు.

ఎంపిక విధానం: టీజీయూజీసెట్‌-2021 ప్ర‌వేశ ప‌రీక్ష ఆధారంగా

ప‌రీక్షా విధానం: ఇంట‌ర్‌ మొద‌టి, రెండో ఏడాది సిల‌బ‌స్ ఆధారంగా ప‌రీక్ష ఉంటుంది. ఈ ప‌రీక్ష‌ను మొత్తం 120 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. ఇందులో మూడు ఆప్ష‌న‌ల్ స‌బ్జెక్టులు(మ్యాథ్స్, ఫిజిక్స్ & కెమిస్ట్రీ లేదా బోటనీ, జువాలజీ & రసాయనశాస్త్రం లేదా గణితం, ఖాతాలు & వాణిజ్యం లేదా ఎకనామిక్స్, అకౌంట్స్ & వాణిజ్యం లేదా హిస్టరీ, ఎకనామిక్స్, & సివిక్స్)తోపాటు జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్ ఉంటాయి. ఒక్కో స‌బ్జెక్టుకు 30 మార్కులు కేటాయిస్తారు. ప్రశ్నాప‌త్రం మొత్తం ఇంగ్లిష్‌, తెలుగు మాధ్య‌మంలో ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

చివ‌రితేదీ: 05 మార్చి, 2021

హాల్‌ టికెట్ డౌన్‌లోడ్ తేదీ: 15 ఏప్రిల్‌, 2021

టీజీయూజీసెట్ ప‌రీక్ష తేదీ: 25 ఏప్రిల్‌, 2021

వెబ్‌సైట్‌: http://tgtwgurukulam.telangana.gov.in

Advertisement

Next Story

Most Viewed