తహశీల్దార్ కేసులో వాంగ్మూలం రికార్డు..!

by  |
తహశీల్దార్ కేసులో వాంగ్మూలం రికార్డు..!
X

దిశ వెబ్ డెస్క్: కీసర మాజీ ఎమ్మార్వో కేసులో కీలక పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో నిందితుల నుంచి వాంగ్మూలం రికార్డు చేశారు ఏసీబీ అధికారులు. వాంగ్మూలంలో జిల్లా కలెక్టర్, కీసర ఆర్డీవో, మరో ఎమ్మార్వో పేర్లు బయటపెట్టారు. హన్మకొండ ఎమ్మార్వో కిరణ్ ప్రకాష్ ద్వారానే ఆర్డీవో రవితో ఒప్పందం కుదిరినట్లు నిందితుడు A3 శ్రీనాథ్ తెలిపారు. రవి ద్వారానే ఎమ్మార్వో నాగరాజుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. రూ. కోటీ 10 లక్షలను వరంగల్ నుంచి తీసుకొచ్చానని శ్రీనాథ్ తెలిపారు.

మరోవైపు కలెక్టర్, ఆర్డీవో ఆదేశాలతోనే భూ వివాదంపై మాట్లాడేందుకు గెస్ట్ హౌస్ కు వెళ్లినట్లు A1 మాజీ ఎమ్మార్వో నాగరాజు తెలిపారు. శ్రీనాథ్‎కు చెందిన ఎలాంటి భూ వివాదం తన పరిధిలో లేదన్నారు. కాగా, నాగరాజు విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని ఏసీబీ అధికారులు తెలిపారు. నాగరాజు పేరిట బాగా ఆస్తులు ఉన్నట్లు ఒప్పుకున్నారని అన్నారు. నాగరాజు బినామీ ఆస్తులు, ఆస్తుల పత్రాలపై ఏసీబీ విచారణ కొనసాగుతోంది. కానీ శ్రీనాథ్ కు చెందిన ఎలాంటి భూ వివాదం తన పరిధిలో లేదు -నాగరాజు


Next Story

Most Viewed