ఉగ్రవాదుల అరెస్టు..

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో మంగళవారం తెల్లవారు జామున ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు పట్టుకున్నాయి. వారి నుంచి ఏకే 47 రైఫిల్స్, ఎం4 ఏఎస్ కార్బైన్, 6 చైనీస్ పిస్టల్స్, ఐఈడీ బాంబులను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడ్డ ఉగ్రవాదులను బిలాల్ అహ్మద్ కుట్టి, షాన్వాజ్ అమ్మద్ మిర్‌గా గుర్తించారు. బోర్డర్‌లో అక్రమ చోరబాటుకు యత్నిస్తుండగా వీరిని భద్రతా బలగాలు గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు.

Advertisement