- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
తీవ్రవాదం క్యాన్సర్ లాంటిది: ఎస్ జైశంకర్
by Anukaran |

X
న్యూఢిల్లీ: టెర్రరిజం క్యాన్సర్ లాంటిదని, మానవాళిని వణికిస్తున్న మహమ్మారి లాంటిదేనని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ది ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (TERI)లో ప్రసంగిస్తూ, ఈ మహమ్మారిలూ ప్రజా జీవనాన్ని గందరగోళంలోకి నెట్టేసిన కొన్ని ఘటనలతో ప్రపంచవ్యాప్త స్పందన కనిపిస్తుందన్నారు.
పాకిస్తాన్‌ను పరోక్షంగా ఉటంకిస్తూ కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ఉత్పత్తి చేస్తున్నాయని ఆరోపించారు. తీవ్రవాదాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్న దేశాలూ తామే బాధితదేశాలుగా నటిస్తున్నాయని విమర్శించారు. కొన్ని ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తుండటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయని, కాబట్టి దానిపై పోరూ నిరంతరం సాగే ప్రక్రియ అని వివరించారు. ఉగ్రవాదానికి వంతపాడుతున్న వ్యవస్థలను నాశనం చేయడానికి ప్రపంచదేశాలు ప్రత్యేక మెకానిజాన్ని తయారుచేసుకోవాలని పిలుపునిచ్చారు.
Next Story