మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం

by Shyam |   ( Updated:2020-10-26 12:35:39.0  )
మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం
X

దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి కురవి రోడ్డులో కారు, బైక్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన తండ్రీకూతురుగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


Next Story