ఇంటర్నల్ మార్కులే ఫైనల్

by Shyam |
ఇంటర్నల్ మార్కులే ఫైనల్
X

దిశ, న్యూస్‌బ్యూరో: కొవిడ్ నేపథ్యంలో పరీక్షలను రద్దు చేసి గ్రేడింగ్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు గ్రేడింగ్‌కు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను బుధవారం విడుదల చేసింది. 2019-20 విద్యాసంవత్సరం అంతర్గత మూల్యంకనంలో భాగంగా విద్యార్థులకు నాలుగు ఫార్కెటివ్ అసెస్‌మెంట్‌లను పాఠశాలల్లో నిర్వహించి, ఇప్పటికే వాటి సగటు మార్కులను ఎస్సెస్సీ బోర్డుకు పంపించారు. విద్యాసంవత్సరంలో విద్యార్థుల ఇంటర్నల్ పరీక్షలకు 20% శాతం వెయిటేజీ ఉంటుంది. వార్షిక పరీక్షలకు 80% వెయిటేజీ కేటాయించారు. అయితే రాష్ట్రంలో కరోనా ప్రభావం పెరుగుతున్నందున పదో తరగతి పరీక్షలు నిర్వహించే పరిస్థితులు లేవు. దీంతో పరీక్షలను రద్దు చేసి ఇంటర్నల్ మార్కల ఆధారంగా పై తరగతులకు ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్నల్స్‌లో విద్యార్థులకు వచ్చిన మార్కులనే 100 మార్కులకు హెచ్చించి గ్రేడింగ్ కేటాయిస్తారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story