మణుగూరు పోలింగ్ కేంద్రం ఎదుట ఉద్రిక్తత

by Sridhar Babu |
KMM2
X

దిశ, మణుగూరు : ఓట్టింగ్ లో పాల్గొనే పట్టభద్రులకు టిఫిన్లు పెడుతూ, డబ్బులు పంచుతూ టీఆర్ఎస్ నాయకులు తమకు అనుకూలంగా మార్చకుంటున్నారని ఆరోపిస్తూ సీపీఐ, సీపీఎం, టీడీపీ, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే రేగా కాంతారావు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఎమ్మెల్యే కార్యాలయం ఎదురుగా ఉన్న పొలింగ్ కేంద్రం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓటర్లకు డబ్బులిచ్చి పోలింగ్ కేంద్రలోకి పంపిస్తున్నారంటూ అఖిలపక్షాలు ఆందోళనకు దిగాయి. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు ప్రచారం నిర్వహించకూడదనే నిబంధన ఉన్నా పోలింగ్ కేంద్రం ఎదురుగా ఉన్న క్యాంపు కార్యాలయంలోనే ప్రలోభాలకు తెరలేపారని మండిపడ్డారు. పోలీంగ్ కేంద్రం ముందు ప్రచారం ఫ్లెక్సీలు తొలగించలేదని, అధికారులు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

KMM

అయితే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి అధికారులు సైతం రాకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు గేట్లకు తాళాలు వేశారు. సమాచారం అందుకున్న మణుగూరు తహసీల్దార్, సీఐ, ఎస్ఐ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. బలవంతంగా గేట్లను తీసి లోనికి ప్రవేశించారు. అక్కడున్న సుమారు 50 మంది ఓటర్లను బయటకు పంపించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలకు, వామపక్ష పార్టీల నాయకుల మధ్య తోసులాట జరిగింది.

Advertisement

Next Story

Most Viewed