బందరులో టెన్షన్.. టెన్షన్..

దిశ, అమరావతి బ్యూరో: మచిలీపట్నంలో సోమవారం హత్యకు గురైన మోకా భాస్కర్ రావు మృతదేహానికి మంగళవారం అంత్యక్రియలు జరుగనున్నాయయి. మరోవైపు మచిలీపట్నంలో పలు ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. హత్యతో సంబంధం ఉన్న ముగ్గురు గూడూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. ముందస్తు జాగ్రత్త చర్యగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటివద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో ఏ వివాదం తలెత్తుతుందోనన్న టెన్షన్ వాతావరణం బందరులో కొనసాగుతోంది.

Advertisement