- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎల్జీ పాలిమర్స్ వద్ద ఉద్రిక్తత.. స్థానికుల అరెస్టు
దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురం వద్దనున్న ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ వద్దకు పెద్ద సంఖ్యలో స్థానికులు చేరుకుని ఆందోళన చేపట్టారు. వెంకటాపురం గ్రామస్థులంతా పరిసర గ్రామాల వారితో కలిసి కంపెనీ గేటు వద్దకు ఒక్కసారిగా చేరుకుని ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని, పరిశ్రమను తరలించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. గ్రమస్థులు వెనక్కి తగ్గకపోవడంతో పరిశ్రమ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
పరిశ్రమలోకి చొచ్చుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ మరింత ఉద్రిక్తత చోటుచేసుకుంది. న్యాయం చేయాలని కోరితే అరెస్టులు చేస్తున్నారని వాగ్వాదానికి దిగి, పోలీసులపై స్థానికులు మండిపడ్డారు. దీంతో యువకులు రంగంలోకి దిగి ఆందోళన కొనసాగిస్తున్నారు. పరిహారిమివ్వడమే ఈ సమస్యకు పరిష్కారం కాదని చెబుతూ… పరిశ్రమ అడిగితే ఆ మొత్తాన్ని గ్రామస్థులంతా ఎత్తుకుని పరిహారంగా ఇస్తామని, పరిశ్రమను తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేజీహెచ్ వరకు వెళ్లారు కానీ, తమ గ్రామానికి రాలేదని వారు ఆక్షేపిస్తున్నారు. గ్రామంలో జీవరాశి మొత్తానికి తీరని అన్యాయం జరిగిందని, ఊరు మొత్తం ఖాళీ అయినప్పటికీ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులెవరూ ఇంతవరకు ముందుకు రాలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇది ఒక గ్రామం మనుగడకు సంబంధించిన విషమని, దీనిని కంపెనీ అలుసుగా తీసుకోవద్దని వారు కోరుతున్నారు.
పరిశ్రమను ఇక్కడ నుంచి తరలించే వరకు తమ ఆందోళనను విరమించబోమని గ్రామస్థులు చెబుతున్నారు. మరోవైపు వెంకటాపురం గ్రామానికి డీజీపీ గౌతమ్ సవాంగ్ చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించి, గ్యాస్‌లీక్ ఘటనలో అస్వస్థతకు గురయిన పోలీసులు, బాధితులను పరామర్శించనున్నారు.