- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్.. గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
దిశ, హుస్నాబాద్ : పరిహారం చెల్లించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని భూ నిర్వాసితులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ.. గౌరవెల్లి ప్రాజెక్టును 1.4 టీఎంసీల నుంచి 8.4లకు రీడిజైన్ చేశారన్నారు. రీడిజైన్‌లో భాగంగా భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మల్లన్న సాగర్‌లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం కల్పించిన వసతుల మాదిరిగానే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, చట్ట ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని వర్తింప చేయకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. రైతులు, భూ నిర్వాసితులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పోలీసులు, నిర్వాసితుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురికి గాయాలైనట్లు రైతులు తెలిపారు. రైతు దినోత్సవం సందర్భంగా అన్నదాతలపై టీఆర్ఎస్ ప్రభుత్వం దాడి చేయించడంపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి నిర్వాసితులకు రావాల్సిన పరిహారం ఇవ్వాలని లేకుంటే ప్రాణాలు కోల్పోయినా ఇండ్లు ఖాళీ చేయమని ప్రభుత్వానికి తేల్చిచెప్పారు.