- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అనుమానాస్పద స్థితిలో యువకుడి ఆత్మహత్య
దిశ, చార్మినార్: అనుమానాస్పద స్థితిలో 19 సంవత్సరాల యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఛత్రినాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భయ్యాలాల్నగర్కు చెందిన గౌర అలివేలు కుమారుడు గౌర అరవింద్ (19) ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తయ్యింది. కరోనా కారణంగా వచ్చిన లాక్ డౌన్ నుంచి ఇంట్లోనే ఉంటున్నారు. బుధవారం ఉదయం తల్లి పనికి వెళ్లింది.
11గంటల సమయంలో నల్లా వస్తుందని, మంచినీళ్లు పట్టానని తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. మధ్యాహ్నం 3గంటల సమయంలో ఇంటి పక్క వారు అలివేలుకు ఫోన్ చేసి మీ అబ్బాయి చీరతో రేకుల షేడ్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. వెంటనే ఇంటికి చేరుకున్న అలివేలు స్థానికుల ద్వారా ఛత్రినాక పోలీసులకు సమాచారం అందజేసింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అరవింద్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేవని పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛత్రినాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.