పంజాబ్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ

by Anukaran |   ( Updated:2021-01-16 06:59:08.0  )
పంజాబ్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ
X

అమృత్‌సర్: పంజాబ్ రాష్ట్రంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ 10 మంది ముఖ్య నాయకులు బీజేపీకి రాజీనామ చేశారు. శిరోమణి అకాలీదల్‌ అధ్యక్షుడు సుక్బిందర్ సింగ్ బాదల్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. నాయకులు బల్వీందర్ సింగ్, సుఖ్‌దేవ్ సింగ్ ఫార్మాహి, బల్ఖర్ సింగ్ సహోత, జగ్తర్ సింగ్ తారి, సుర్జీత్ కౌర్, బల్జిత్ సింగ్ చాహల్, బహదూర్ ఖాన్, రవీందర్ కుమార్ శర్మ, బాగేల్ సింగ్ తదితరుల అకాలీదల్‌లో చేరిన వారిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ బీజేపీకి రాజీనామ చేసినట్లు ఆ నాయకులు తెలిపారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోకపోతే పార్టీ కార్యకర్తలు ఒక్కరూ కూడా మిగిలరని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి తెలిపామన్నారు. అయితే, మా సలహాలను పార్టీ తిరస్కరించిందని, అందుకు బదులుగా కేంద్ర వ్యవసాయ చట్టాలకు అనుగుణంగా గ్రామాల్లో ప్రచారం చేయమన్నారని పేర్కొన్నారు. తమ అభిప్రాయాలను పరిగణనలో తీసుకోనందున పార్టీని వీడుతున్నట్లు నాయకులు తెలిపారు.

Advertisement

Next Story