జలదిగ్బంధంలో ఆలయాలు.. కారణం మహారాష్ట్ర

by  |
జలదిగ్బంధంలో ఆలయాలు.. కారణం మహారాష్ట్ర
X

దిశ, బోధన్: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. దీంతో పరివాహక ప్రాంతంలోని ఆలయాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద శివాలయంతో పాటు నందిపేట్ మండలం ఉమ్మెడలోని ఉమా మహేశ్వర ఆలయాలు పూర్తిగా నీట మునిగాయి.

ఉమామహేశ్వర ఆలయ గోపురం మాత్రమే బయటకు కనిపిస్తోంది. పలు ఆలయాలు నీట మునగడంతో పూజలు నిలిచిపోయాయి. అటు ముంపు ప్రాంతమైన కుస్తపూర్ శివాలయం కూడా నెలరోజుల కిందటే నీట మునిగింది. అటు ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది.


Next Story

Most Viewed