- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీరు మాతోనే ఉన్నామని నిరూపించండి: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
కీవ్: రష్యా దురాక్రమణ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ కీలక విజ్ఞప్తి చేశారు. యూరోపియన్ పార్లమెంట్‌లో వర్చువల్‌గా ప్రసంగించిన ఆయన 'ఈయూ ఉక్రెయిన్‌కు మద్ధతుగా ఉన్నట్లు నిరూపించుకోవాలి' అని కోరారు. ఆయన మాట్లాడుతూ 'మీరు లేకుంటే ఉక్రెయిన్ ఒంటరి అవుతుంది. మేము మా సామర్థ్యాన్ని నిరూపించుకున్నాం. కనిష్ట స్థాయిలోనూ మేము మీలాగే ఉన్నాం. కావున మీరు మాతో ఉన్నారని నిరూపించండి. మీరు మమ్మల్ని విడిచి వెళ్లరని నిరూపించండి. మేము మా నగరాలన్ని నిర్బంధంలో ఉన్నప్పటికీ సొంత భూమికోసం, స్వాతంత్రాన్ని నిలపడం కోసం పోరాడుతున్నాం. ఎవ్వరూ మమ్మల్ని విడగొట్టలేరు. మేము ఉక్రెయిన్ పౌరులం. మేము దృఢంగా ఉన్నాం' అని అన్నారు. జెలెన్‌స్కీ ప్రసంగంపై ఈయూ పార్లమెంటు మొత్తం నిలబడి చప్పట్లు కొట్టారు. పార్లమెంట్ అధ్యక్షుడు రొబార్ట్ మెట్సొలా మాట్లాడుతూ.. యూరప్ తన మద్దతు పట్ల స్పష్టంగా ఉన్నట్టు తెలిపారు. విలువల కోసం వీధిలో పోరాడే వారికి మద్దతిస్తూ, పుతిన్ యుద్ధ యంత్రాలను నిలదీస్తామని అన్నారు. ఇప్పటికే ఈయూ ఉక్రెయిన్‌కు మద్ధతును ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రష్యా యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నాయి.