- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజాయితీ గల వ్యక్తిని ఎక్కువ కాలం ఆపలేరు: సిద్ధూ కూతురు కీలక వ్యాఖ్యలు
చంఢీగడ్: నిజాయితీ గల వ్యక్తిని ఎక్కువ కాలం ఆపలేరని నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూతురు రబియా కౌర్ అన్నారు. పంజాబ్ కాంగ్రెస్ సీఎం ఎంపికపై ఆమె పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చరణ్ జిత్ సింగ్ ఛన్నీని ఎంపిక చేయడంపై స్పందిస్తూ 'మీరు నిజాయితీ గల వ్యక్తిని ఎక్కువ కాలం ఆపలేరు. కానీ నిజాయితీ లేని వ్యక్తి చివరికి ఆగిపోవాలి' అని అన్నారు. అభ్యర్థి ఎంపికపై పార్టీ హైకమాండ్ బలవంతం చేసి ఉండొచ్చని తెలిపారు. ఛన్నీని పేదవాడిగా పేర్కొనడంపై రబియా అనుమానం వ్యక్తం చేశారు. ఆయన అకౌంట్లో రూ.133 కోట్లకు పైగా ఉంటాయని చెప్పారు. తన తండ్రి 14 ఏళ్లుగా పంజాబ్ కోసం పని చేస్తున్నారని తెలిపారు. ఆయన రాష్ట్రం కోసం కొత్త నమూనాను సృష్టించారని అన్నారు. ఆయనతో ఇతర నేతలకు ఎలాంటి పోలిక లేదని చెప్పారు. ప్రజలు డబ్బులకు అమ్ముడు పోకుండా, నిజానికి మాత్రమే ఓటు వేస్తారని అన్నారు. తన తండ్రి గెలిచే వరకు పెళ్లి చేసుకోనని పునరుద్ఘాటించారు. శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి విక్రం సింగ్ మజితియా రాజకీయ పాఠాలు సిద్ధూ వద్దే నేర్చుకుని ఆయనపైనే పోటీకి దిగుతున్నారని అన్నారు. ఈ పోరు డ్రగ్స్‌కు, అభివృద్దికి మధ్య అని చెప్పారు.