- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తింటే.. ఊహించని ప్రయోజనాలు!
దిశ, ఫీచర్స్: ఉదయంపూట బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయొద్దనేది ఆరోగ్య నిపుణులు తరచూ చెప్పే మాట. అయితే కొందరు పూరి, ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి రెగ్యులర్ అల్పాహారాలకు బదులు పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, కేకులు, కుకీస్ తినేందుకు ఇష్టపడతారు. ఇవి తింటే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని తెలిసిందే. కానీ పిజ్జా, బర్గర్లు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వినేందుకు షాకింగ్‌గా ఉన్నా.. వీటిని సరైన పద్ధతిలో తయారుచేస్తే ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు. ఇంతకీ అవేంటో చూద్దాం..
ఫ్రెంచ్ ఫ్రైస్ :
ఒక నివేదిక ప్రకారం ఫ్రెంచ్ ఫ్రైస్‌లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి కావలసిన పోషకాలు అందడంలో సాయపడుతుంది. కండరాలు, కీళ్ళ నొప్పిని నివారిస్తుంది. అంతేకాదు గర్భస్థ శిశువుల మెదడు అభివృద్ధి చెందేందుకు తోడ్పడుతుంది.
పిజ్జా..
పిజ్జాలో యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇక పిజ్జా తయారీకి టమాటా చట్నీ వాడతారు. ఇందులో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుంది. పిజ్జాలో ఉపయోగించే కూరగాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాదు పిజ్జాను గోధుమ పిండితో తయారుచేస్తే ఇంకా హెల్తీ.
పాప్‌కార్న్..
పాప్‌కార్న్ తింటే.. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని ఓ నివేదిక వెల్లడించింది. దీంతో గుండె జబ్బులు ప్రమాదం తగ్గుతుంది. 3 కప్పుల పాప్‌కార్న్ 1 కప్పు ఓట్‌మీల్‌కి సమానం. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది. పాప్‌కార్న్‌లో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. మామూలుగా సీజన్‌తో సంబంధం లేకుండా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు.
హాంబర్గర్..
రెడ్ మీట్‌తో తయారు చేసిన హాంబర్గర్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇంట్లో తయారుచేసిన హాంబర్గర్‌లో లీన్ మాంసాలను ఉపయోగించవచ్చు. ఇది న్యూరోలాజికల్ డిజార్డర్స్‌ను నివారించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. హాంబర్గర్‌లో 2.5 మైక్రోగ్రాముల విటమిన్ బి-12 కూడా ఉంటుంది. పట్టీలను వేయించడానికి బదులు, వాటిని గ్రిల్ చేస్తే.. హాంబర్గర్‌ను ఆరోగ్యంగా చేసుకోవచ్చు.
కేక్..
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో 600 కేలరీలు గల కేక్ తింటే బరువు తగ్గుతారని ఓ అధ్యయనం వెల్లడించింది. సాధారణంగా ఏదైనా అకేషన్ లేదంటే బర్త్‌డేస్ సందర్భంగానే కేక్ ఎక్కువగా తింటుంటాం. కానీ అల్పాహఆరంగా తీసుకోవడం ద్వారా ఆకలి తగ్గి తద్వారా బరువు తగ్గుతారు.