- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖారారు!
లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ వచ్చే శుక్రవారం (మార్చి 25న) రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు యూపీ బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు శుక్రవారం ప్రకటించారు. లక్నోలోని ఎకానా స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకార వేడుక జరగనుంది. అయితే, గత 37 ఏళ్ల తర్వాత యూపీలో రెండోసారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన సీఎంగా యోగి నిలిచిపోనున్నారు. రాష్ట్రంలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలుండగా 2017 లో బీజేపీ సొంతంగా 303 సీట్లను గెలుచుకోగా ఈసారి -2022 ఎన్నికల్లో 255 సీట్లను గెలుచుకుంది. ఎన్డీయే మిత్రపక్షాలు మరో 18 సీట్లు గెలుచుకున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీ 43 సిట్టింగ్ సీట్లను కోల్పోయినా పార్టీకి ఓట్ల శాతం పెరిగింది. ఇక ప్రధాన ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ 125 సీట్లు గెలుచుకుని రెండో స్థానంలో నిలవగా గతంతో పోలిస్తే 73 సీట్లు పెరిగాయి. ఇకపోతే సీఎం యోగి ఆదిత్యనాథ్ మొదటిసారి గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.