రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్

by Harish |   ( Updated:2022-04-11 13:18:09.0  )
రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్
X

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నూతన ప్రధానిని ఎన్నుకునే నేపథ్యంలో నేషనల్ అసెంబ్లీ సభ్యుడిగా రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా దొంగలతో కలిసి తాను అసెంబ్లీలో కూర్చోబోనని సంచలన వ్యాఖ్యలు చేశారు. 'రూ.16 బిలియన్లు, రూ.8 బిలియన్లకు పైగా అవినీతి నేరాల్లో ఉన్న వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకోవడం దేశానికి అతిపెద్ద అవమానం. మేము నేషనల్ అసెంబ్లీకి రాజీనామా చేస్తున్నాం' అని పార్టీ అధికార ఖాతా ద్వారా ఇమ్రాన్ ట్వీట్ చేశారు. ఇక ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇమ్రాన్ కు మద్దతుగా అనేక మంది మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఇదే విషయాన్ని తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు.

యూఎస్ మద్దతు ఇస్తున్న కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న అనుచరులకు, మద్దతుదారులకు నా ధన్యవాదాలు. స్వదేశంలో, విదేశాల్లోని పాక్ ప్రజలు తిరస్కరించినట్లు దీంతో అర్థమవుతుంది. మోసగాళ్ల నేతృత్వంలోని దిగుమతి చేసుకున్న ప్రభుత్వాన్ని తిరస్కరిస్తూ, దేశ చరిత్రలో ఇంతకుముందెప్పుడు ఇంత సంఖ్యలో జనాలు బయటకు రాలేదు' అని సోమవారం ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed